ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ప్రస్తుతం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ దేశంలో దేశీయ క్రికెట్ లీగ్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి వస్తున్నా గుర్తింపు చూసి తాము కూడా దేశీయ లీగ్ లతో అలాంటి గుర్తింపు సంపాదించుకోవాలి అని భావిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది కొత్తగా మరో రెండు టి20 లీగ్ లు  జరగబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్  కూడా జరగబోతుంది.


ఇక ఈ లీగ్ ఐపీఎల్ తరహాలోనే ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ టోర్నీలో పాల్గొనే జట్లను ఇక్కడ ఐపీఎల్ లోని ఫ్రాంఛైజీల కొనుగోలు చేయడం గమనార్హం. సాధారణంగా ఇలా టీ20 లీగ్ నిర్వహించినప్పుడు మెగా వేలం ప్రక్రియ ప్రారంభిస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే సౌతాఫ్రికాలో వచ్చే ఏడాదిలో నిర్వహించబోయే టి20 లీగ్ లో ఆడబోయే ప్లేయర్ ల కోసం ఆరు జట్లు కూడా వేలం లో పాల్గొని తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి అని చెప్పాలి. ఇలా మెగా వేలం జరిగినప్పుడు ఎవరు ఎక్కువ ధర పలికే వారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా టి20 లీగ్లో భాగంగా జరిగిన మెగా వేలం లో అత్యధికంగా సౌత్ ఆఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్ 4.15 కోట్ల రూపాయల కోసం సన్రైజర్స్ ఈస్టర్న్స్  దక్కించుకుంది అనేది తెలుస్తుంది. వేలంలో ఎమ్ఐ కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్స్ రాయల్స్,  జోహెన్నెస్బర్గ్  సూపర్ కింగ్స్, డర్బన్  సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ ఈస్టర్న్స్ లు ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. కాగా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్ ను దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు కూడా ఎంతగానో పోటీపడ్డాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: