అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది . ఈ టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో అటు టీమిండియా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. కొంతకాలం నుంచి జట్టులో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చిన టీమిండియా ఇప్పుడు మాత్రం ప్రయోగాలకు  కాస్త దూరం అవుతూ ఉంది అనే చెప్పాలి. వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్  జట్టులో ఎవరు ఉండాలి అనే విషయంపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే జట్టు వివరాలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.



 అయితే వరల్డ్ కప్ కి ముందు స్వదేశం వేదికగా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు.  ఈ క్రమంలోనే స్వదేశంలో టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అనే చెప్పాలి. నేడు మొదటి టి20 మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా భారత జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆడబోయే ఈ రెండు టి 20 సిరీస్ లు కూడా జట్టుకు పెద్ద పరీక్ష లాంటిదే అని చెప్పాలి.  ప్రపంచ కప్ కి ముందు ఈ సిరీస్ భారత్ కు ఎంతో కీలకం కానుంది అని చెప్పాలి. ఆసియా కప్ లో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా బ్యాటింగ్ బౌలింగ్లో జట్టు లోపాలను సరి చేయాల్సి ఉంటుంది.


 మిడిలార్డర్లో ఎవరిని బ్యాటింగ్ కి పంపాలి.. ఎలాంటి కామినేషన్ లో అత్యుత్తమ జట్టును సిద్ధం చేసుకోవాలి అనే విషయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది . వరల్డ్ కప్ ముందు అటు జడేజా జట్టుకు దూరమవ్వడం పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ అతని స్థానంలో జట్టులో స్థానం సంపాదించుకున్నా అక్షర్ పటేల్ బాగా రాణిస్తాడు అనే నమ్మకంతో ఉంది టీమిండియా యాజమాన్యం. ఇక అక్షర్ పటేల్ ఏ మేరకు రాణించగలుగుతాడు.. జడేజా స్థానాన్ని ఫుల్ ఫిల్ చేయగలుగుతాడా లేదా అన్నది మాత్రం ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లతో జరగబోయే సిరీస్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: