విరాట్ కోహ్లీ గురించే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కూడా ఈ స్టార్ ప్లేయర్  తరచూ వార్తల్లో నే ఉన్నాడు. అయితే మొన్నటి వరకు సరైన ఫామ్లో లేడు ఒకప్పటిలా పరుగులు చేయలేకపోతున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు మాత్రం అతను ఎన్నో రికార్డులు కొల్లగొట్టగలడు అంటూ అందరూ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు అనే చెప్పాలి. దాదాపు కొన్ని నెలలపాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లోమెరుపు సెంచరీ చేసి మళ్లీ తాను ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.


 ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ ఆడబోయే తదుపరి మ్యాచ్ లో అతని ప్రదర్శనలు ఎలా ఉండబోతోంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కారణంగా విరాట్ కోహ్లీ కెరియర్లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.  ఇక తద్వారా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు అనే చెప్పాలి.


 ఇకపోతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  సచిన్ సాధించిన వంద శతకాల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. రికీపాంటింగ్ ఐసిసి రివ్యూ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో కాస్త నెమ్మదించిన ప్పటికీ  సచిన్ రికార్డును మాత్రం తప్పక బ్రేక్ చేస్తాడు. ఇందులో అనుమానమేమీ లేదు.  ఇంకా ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ ఆడ గలిగే సత్తా అతనిలో ఉంది. ఏ రికార్డు అయినా సరే సాధించలేడు అని చెప్పలేం.  ఎందుకంటే అతనిలో విజయ దాహం తీరనిది అంటూ రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: