గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టులో స్థానం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రిషబ్ పంత్ స్థానానికి టీమిండియాలో డోకా ఉండేది కాదు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా టీమిండియా వెటరన్ బాట్స్మన్ దినేష్ కార్తీక్ తన కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ కనబరిచాడు. ఈ క్రమంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్ లతో టీమిండియా సెలెక్టర్లు చూపులు ఆకర్షించాడు. దీంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు.


 ఇక ఇండియా జట్టులోకి వచ్చిన తర్వాత అదే రీతిలో అదిరిపోయే ప్రదర్శన చేశాడు దినేష్ కార్తీక్. దీంతో ఎన్నో రోజుల నుంచి టీమిండియాను వేధిస్తున్న ఫినిషర్ పాత్రను దినేష్ కార్తీక్ తీసుకున్నాడు అని చెప్పాలి. దీంతో సెలెక్టర్లు టి20 ఫార్మాట్లో అతని స్థానాన్ని సుస్థిరం చేశారు. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో కూడా చోటు దక్కించుకున్నాడు దినేష్ కార్తీక్. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు రిషబ్ పంత్ ని  తుది జట్టులోకి తీసుకోవాలా లేకపోతే దినేష్ కార్తీక్ ని తీసుకోవాలా అన్న విషయం పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.


 అయితే కొంత మంది రిషబ్ పంత్ కు మద్దతుగా నిలుస్తూ ఉంటే మరి కొంతమంది దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవలే రిషబ్ పంత్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ  హెడెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ ఇండియన్ టీం కి ఫ్యూచర్ ప్లేయర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సమయంలో అతనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  ఒకవేళ నేను గనుక సెలెక్ట్ స్థానంలో ఉండి ఉంటే ప్రతి మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా మాథ్యూ  హెడెన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: