టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఇతని పేరు వినిపించింది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఇతను అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన రికార్డుల గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ రేంజ్ లో తన ప్రస్థానాన్ని కొనసాగించాడు విరాట్ కోహ్లీ.  ఇక ప్రస్తుత క్రికెటర్లలో రికార్డుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఇప్పటి వరకు తన కెరియర్లో 71  సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ తిరుగులేదు అని నిరూపించాడు. అయితే ఒకరకంగా అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ మోస్ట్ వాంటెడ్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.



 ఇక ప్రతి దేశ క్రికెట్ బోర్డు కూడా తమ జట్టులో విరాట్ కోహ్లీ లాంటి ఒక ఆటగాడు ఉంటే చాలు అని కోరుకుంటూ ఉంటారు అంటే విరాట్ కోహ్లీ ఆటతీరు ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  అయితే విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా తనకు తిరుగు లేదు అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్ పెంచుకున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు పేలవమైన ఫామ్ కారణంగా విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.


 కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్నప్పటికీ అతని పాపులారిటీ మాత్రం ఎక్కడా తగ్గలేదు అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక రిపోర్టు వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మాక్స్ చేసిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఆగస్టు నెలలో పేలవమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్లోకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు అనే చెప్పాలి. దీంతో ఆగస్టు నెలలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడుగా కోహ్లీ నిలిచాడు. ఇక తర్వాత స్థానంలో మహేంద్రసింగ్ ధోని, క్రిస్టియానో రోనాల్డో, రోహిత్ శర్మ,  సచిన్ టెండుల్కర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: