గత కొంతకాలం నుంచి టి20 ఫార్మట్ లో టీమ్ ఇండియా ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యర్థి ఎవరైనా సరే ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది టీమిండియా. ఈ క్రమంలోని రోహిత్ కెప్టెన్సీలో పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓడిపోతుంది అనుకుంటున్న మ్యాచ్ లలో కూడా మంచి విజయాలను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక టీమిండియాలో బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం కూడా మునుపెన్నడూ లేని విధంగా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇక వరుస విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ టి20 లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా కూడా రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది టీం ఇండియా. ఈ ఏడాదిలో అత్యధిక టి20 లలో విజయం సాధించిన జట్టుగా ప్రస్తుతం పాకిస్తాన్ తో సమానంగా కొనసాగుతోంది టీం ఇండియా. అయితే ఆస్ట్రేలియా తో జరగబోయే మూడవ టి20 మ్యాచ్లో విజయం సాధించింది అంటే ఇక ఆత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా టీమిండియా అగ్రస్థానంలోకి వెళ్లబోతుంది అని చెప్పాలి. కాగా ఇప్పుడు వరకు ఈ ఏడాది టీ20 లలో 28 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 20 విజయాలు సాధించింది. అయితే పాకిస్తాన్ కూడా ప్రస్తుతం 20 విజయాలతో కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే ఆస్ట్రేలియా తో రేపు జరగబోయే టి20 మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఒక వైపు టి20 సిరీస్ గెలుచుకోవడమే కాదు ఇక ఈ ఏడాది అత్యధిక టి20 లు గెలిచిన జట్టుగా కూడా ప్రపంచ రికార్డును క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా మూడు టి20 ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా.. రెండవ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది. ఈ క్రమంలోనే మూడవ మ్యాచ్ రెండు చెట్లకు కూడా  డు ఆర్ డై  మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: