నేడు టీమిండియా డు ఆర్ డై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా తో మూడవ టి20 సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయింది కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా రెండవ టి20 మ్యాచ్ లో పుంజుకొని విజయం సాధించింది టీమిండియా. ఇక నేడు నిర్ణయాత్మకమైన మూడవ టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ప్రపంచ కప్కు ఆతిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఓడించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తుంది. అదే సమయంలో ఎంతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇక టీమిండియా పై సిరీస్ విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారబోతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇకపోతే మొన్నటికి మొన్న రెండవ టి20 మ్యాచ్ సమయంలో వర్ష ప్రభావం కారణంగా కేవలం 8 ఓవర్లు మాత్రమే మ్యాచ్ జరిగింది.


మరీ నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో వర్ష ప్రభావం ఏమైనా ఉందేమో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పాలి. హైదరాబాద్లో జరిగే మూడవ టి20 మ్యాచ్ కు ఎలాంటి వర్ష ప్రభావం లేదు అంటూ స్పష్టం చేసింది. అభిమానులకు ఆందోళన అవసరం లేదు అంటూ తెలిపింది. హైదరాబాద్ లో చాలా తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు వాతావరణ శాఖ అధికారులు. అయితే రోజంతా మబ్బులు మాత్రం ఉంటాయి అంటూ తెలిపారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: