మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఎంతలా విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదటి నుంచి కూడా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన బ్యాటింగ్ ముందు ఎవరు సాటిరారు అనే విషయాన్ని తాను చెప్పడం కాదు ఎంతోమంది దిగ్గజా క్రికెటర్ల నోటి నుంచే చెప్పించాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్ లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ బౌలర్లు అందరికీ కూడా సింహ స్వప్నంలా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ మొన్నటికి మొన్న కొన్నాళ్లపాటు పేలవమైన ఫామ్ లో కొనసాగిన విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో భాగంగా భారత జట్టుతో చేరాడు. అయితే కోహ్లీ ఎలా రాణిస్తాడో అని అభిమానులు అందరూ కూడా ఆశగా ఎదురు చూసారు. ఇలాంటి సమయంలోనే ఆశించిన దాని కంటే అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ.


 ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ చేసి చెలరేగిపోయాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే తర్వాత జరిగిన మ్యాచ్లో కూడా అదే రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు. కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ కోహ్లీ పరుగుల రారాజు అని అజయ్ జడేజా ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ విషయంలో అతనిలో ఉండే స్థిరత్వం ఎనలేనిది అంటూ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ కి కూడా అలాంటిదే కావాలి అంటూ తెలిపాడు. ఇక ఆటను ఎలా నడిపించాలో కోహ్లీకి బాగా తెలుసు అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: