సాధారణంగా క్రికెట్ ఆటలో గెలుపు ఓటములు అనేవి సహజం. అయితే గెలిచినప్పుడు ఇక ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఏం చెబుతాడు అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు ప్రేక్షకులు. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఇక సారధిగా ఉన్న వ్యక్తి ఎలాంటి కారణాలను చెబుతాడు అన్నదానిపై అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఓడిపోయిన జట్టు కెప్టెన్ చెప్పే కారణాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే భారత్ చేతిలో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ టెంప భావుమా ఓటమిపై చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 చెత్త బ్యాటింగ్, పిచ్ సరిగా అంచనా వేయలేకపోవడమే భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం అంటూ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయడంలో తమ బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది అంటూ తెలిపాడు. మూడు టి20 సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తో ఇటీవల తిరువనంతపురం వేదికగా టీమిండియా మొదటి టి20 మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది సౌత్ ఆఫ్రికా.


 తర్వాత రెండు వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్ ను చేదించి విజయం అందుకుంది టీమిండియా.  ఓటమిపై స్పందించిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంప భావుమా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటంలో  మేము విఫలమయ్యాం. పిచ్ ఇలా ప్రభావం చూపుతుందని మేము ఊహించలేదు. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుందని భావించాం. కానీ ఫేసర్ లకు పిచ్ నుంచి బాగా అడ్వాంటేజ్ లభించింది.  ఇక మా బౌలర్లు తమ వంతు ప్రయత్నించినప్పటికీ వారి దగ్గర సరిపోని పరుగులు లేవు. కానీ వారు బాగా పోరాడారు అంటూ తెంప బావుమా చెప్పుకొచ్చాడు. పిచ్  ఎలా ఉందో సరైన అవగాహన తెచ్చుకొని ఉంటే బాగుండేది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: