ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగా ఎంతో మంది మాజీ క్రికెటర్లు మరోసారి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారూ. ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్మెన్లు మరోసారి మెరుపులు మెరూపిస్తూ అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేస్తున్నారు అని చెప్పాలీ. అయితే ఇటీవలే భారత జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.


 అయితే భారత జట్టు పైనల్ లో అడుగు పెట్టింది అంటే అందుకు కారణం భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే అంతకు ముందు జరిగిన మ్యాచ్లో కూడా బౌలింగ్లో బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నాడు. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు అర్థ సెంచరీలు చేసాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 13 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ తో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. చివర్లో మెరుగు బ్యాటింగ్ తో భారత జట్టును ఒంటి చేత్తో ఫైనల్లో నిలిపాడు.


 అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ వయస్సు కేవలం 37 సంవత్సరం మాత్రమే. అంటే టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తీక్ వయసుతో సమానం. 2012లో ఇర్ఫాన్ పఠాన్ చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తర్వాత రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత క్రికెట్కు దూరంగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు రోడ్డు సేటు వరల్డ్ సిరీస్ లో అతను బాగా రాణిస్తూ ఉండడంతో ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గాయాల నుంచి కోలుకుని మళ్ళీ పట్టు విడవకుండా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఉంటే దినేష్ కార్తీక్ లాగా అతను తప్పకుండా టీమిండియా తరఫున పునరాగం చేసేవాడు. ఇప్పటికీ అతనిలో మంచి ఆల్ రౌండర్ దాగి ఉన్నాడు అంటూ ఎంతోమంది క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: