ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా 237 పరుగులు చేసింది. అయితే ఇంత భారీ టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా చేదించడం కష్టం అని అందరూ భావించారు. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగడానికి ముందే ఆ జట్టు ఓడిపోవడం ఖాయం అని అంచనా వేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలోనే అటు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు కూడా చెలరేగిపోయారు అన్న విషయం తెలిసిందే.


 ఒకానొక దశలో ఇక సౌతాఫ్రికా జట్టు విజయం సాధించడం కష్టం అనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు అని చెప్పాలి. మరోవైపు డికాక్ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఇక సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుందేమో అన్న ఉత్కంఠ నెలకొంది. చివర్లో 16 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇక విజయం సాధించిన జట్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది అని చెప్పాలి.


 అయితే తనకు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడంపై కేఎల్ రాహుల్ భిన్నంగా స్పందించాడు. సాధారణంగా ఎవరైనా సరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తే సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం తనకు ఈ అవార్డు వద్దు అంటూ చెప్పాడు. 28 బంతుల్లో రాహుల్ 57 పరుగులు చేస్తే.. సూర్య కుమార్ 22 బంతులు 61 పరుగులు చేశాడు. రాహుల్ కి కాకుండా సూర్యకుమార్కు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కి ఉంటే బాగుండేది అని అందరూ భావించారు.  కేఎల్ రాహుల్ స్పందిస్తూ మాన్ అఫ్ ది మ్యాచ్ కి సూర్యకుమార్ అర్హుడు.. మ్యాచ్ మొత్తాన్ని తిప్పేసాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అంటూ కేఎల్ రాహుల్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: