ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన నాటి నుంచి తన అద్భుతమైన బ్యాటింగ్తో ఇక తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక తన ప్రతిభతో ఎప్పటికప్పుడు టీమిండియాలకు విజయాన్ని అందిస్తూ కీలక బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. ఆ తర్వాత కాలంలో మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులను కొలుగొట్టాడు.


 భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ  కూడా తన బ్యాటింగ్ ప్రతిభతో మెప్పించి హిట్ మ్యాన్ అనే ఒక అరుదైన బిరుదును కూడా అందుకున్నాడు రోహిత్ శర్మ. ముఖ్యంగా టి20 ఫార్మాట్ కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.. మొన్నటి వరకు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇక ఎప్పుడూ సారథిగా మారిపోయి టీమ్ ఇండియాను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. టీమిండియా కు వరుసగా విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే అంతర్జాతీయ టి20 ఫార్మాట్లో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.


 భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో రెండవ టి20 మ్యాచ్ జరగగా ఇక ఓపెనర్ గా బరిలోకి దిగి మంచి ఆరంభం ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్ తో అత్యధిక టి20 మ్యాచ్ లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ, దేశవాళీ లీగ్స్ లో కలిపి రోహిత్ శర్మ 400 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇదే ఇప్పటివరకు అత్యధికం. కాగా ఈ లిస్టులో దినేష్ కార్తీక్ రెండవ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా 368 టీ20 లు ఆడాడు దినేష్ కార్తీక్.  ఇక ధోని 361,కోహ్లీ 354 టీ20 మ్యాచ్లు ఆడి అటు ఈ లిస్టులో తర్వాత స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారూ. ఇక ఇలా రోహిత్ శర్మ తన కెరీర్ లో 400 టీ20 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: