టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎన్నో జట్లు ప్రత్యర్ధులతో టి20 ఫార్మాట్లో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ జట్టు అటు ఇంగ్లాండ్తో ఏడు టి20ల సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ జట్టు ఘోర పరాభవాన్ని చదివి చూసింది. సొంత గడ్డపై కూడా ఇంగ్లాండ్పై విజయం సాధించలేకపోయింది. ఏడు టి20 సిరీస్ లో భాగంగా 4-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. అయితే చెత్త ఫీల్డింగ్ కారణంగానే పాకిస్తాన్ ఈ సిరీస్ చేజార్చుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ టోర్నీలో భాగంగా అటు పాకిస్తాన్ ఆటగాళ్లందరూ కూడా ఫీల్డింగ్ లో దారుణంగా విఫలం అయ్యారు అని చెప్పాలి. ఇక మెగా టోర్నీ ముందు దాయాది ఆటగాళ్ల ఫీల్డింగ్ ఆ దేశ అభిమానులందరినీ కూడా ఎంతగానో కలవరపెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజం రెండు సులువైన క్యాచ్ లను నేలపాలు చేశాడు. మరో కీలక ప్లేయర్ మహమ్మద్ వసీం కూడా లాలీపాప్ లాంటి క్యాచ్ ని వదిలేసాడు. దీంతో ఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ఫీల్డింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు తమ జట్టు ఆటగాళ్లు ఫిక్సింగ్ కి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఉండడం గమనార్హం.


 ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజాం అయితే ఏకంగా నిలబడిన చోటుకి వచ్చిన ఎంతో సులువైన క్యాష్లను వదిలేసాడు. సరిగ్గా బంతి వచ్చి చేతుల్లో పడిన కూడా దానిని పట్టుకోలేక నేలపాలు చేశాడు అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ ఫీల్డర్లు  చేసిన తప్పిదాల కారణంగా వికెట్ దక్కించుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు వీర విహారం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు అమ్ముడుపోయారని పిసిబి వెంటనే విచారణ జరపాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: