సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎప్పుడు కూడా విధ్వంసం సృష్టిస్తారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక పొట్టి ఫార్మాట్లో ఎక్కువగా బ్యాట్స్మెన్ లదే హవా నడుస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే కేవలం తక్కువ బంతులు మాత్రమే ఉంటాయి కాబట్టి క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్లు కొట్టాల్సి ఉంటుంది. ఇలా బ్యాటింగ్ చేసినప్పుడే మంచి ప్రదర్శన చేశాడూ అనే పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలోని ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు  ఫోర్ లతో వీర విహారం చేస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉంటారు.


 ఇకపోతే ఇక పొట్టి ఫార్మాట్లో ఎవరైనా బ్యాట్స్మెన్ ఏకంగా సెంచరీ సాధించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. టి20 లలో సెంచరీ అంటే  ఎంతో గ్రేట్ అన్నట్లుగానే ఫీలవుతూ ఉంటారు. ఎందుకంటే ఎంతో ఒత్తిడితో కూడిన టి20 ఫార్మాట్లో సిక్సర్లు పోర్లతో చెలరేగిపోయి తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం అంటే అది అంత సులభం అయ్యే పని కాదు. కానీ కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రం కేవలం సెంచరీ కాదు ఏకంగా అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్లో తీవ్రమైన ఒత్తిడి మధ్య సెంచరీ చేయడమే ఎక్కువ అనుకుంటే ఇక్కడొక బ్యాట్స్మెన్ మాత్రం డబుల్ సెంచరీ చేసేసాడు.


 వెస్టిండీస్ ఆటగాడు రహీం కార్నివాల్ యూఎస్ఏ టి20 లీగ్ లో భాగంగా ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. గ్రీజులోకి వచ్చిన తర్వాత మొదటి బంతి నుంచి విరుచుకుపడుతూ సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 77 బంతుల్లోనే 22 సిక్సర్లు 17 ఫోర్ లతో 205 పరుగులు చేశాడు. దీంతో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అట్లాంటా ఫైర్ జట్టు 326 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత భారీ లక్ష చేతనతో బరిలోకి దిగిన స్క్వేర్ డ్రైవ్ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 172 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: