మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 16వ తేదీన మొదటి మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ ఆటగాల్లని ఎంపిక చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కొన్ని జట్లు ఇక ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఉన్నాయి. కాగా ప్రపంచ కప్  ఆడేందుకు సెలెక్ట్ చేసిన జట్టులో ఉన్న సభ్యులకు ఎలాంటి గాయాలు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అని చెప్పాలి.


 ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని జట్లకు మాత్రం అటు దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండడం గమనార్హం. గత కొన్ని రోజుల నుంచి టీమిండియా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న రవీంద్ర జడేజా, బుమ్రా  గాయం కారణంగా వరల్డ్ కప్ లో జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. ఇక వీరు లేకుండా టీమిండియా వరల్డ్ కప్ లో విజయవంతమైన ప్రస్థానన్ని కొనసాగించడం కాస్త కష్టమే అన్న వాదన కూడా వినిపిస్తుంది.


 ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అనేది తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో వరల్డ్ కప్  ప్రారంభం కానుండగా  గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా జట్టులో కీలక ఫేస్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్న  ప్రిటోరియస్ జట్టుకు దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది. వరల్డ్ కప్ కోసం మాత్రమే కాదు భారత్తో జరగబోయే వన్డే సిరీస్కు కూడా అతను దూరమయ్యాడు. ఇండియాలో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ప్రిటోరియస్ వేలు విరిగిందట. ఈ క్రమంలోనే సర్జరీ చేయాల్సి ఉంది. దీనికోసం అతను కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉందట. అయితే అతని స్థానంలో మార్కో జాన్సన్ అనే మరో ఆల్ రౌండర్ ని జట్టులోకి తీసుకుంది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి: