ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న బెస్ట్ బౌలర్ల పేరు తీస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు జఫ్రా ఆర్చర్. తనదైన బౌలింగ్ తో అంతర్జాతీయ క్రికెట్లో తనకు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పుడు ఫిట్నెస్ కు ప్రాధాన్యమిచ్చేది జఫ్రా ఆర్చర్ గత కొంతకాలం నుంచి మాత్రం గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు గాయాలు అన్నింటినీ కూడా అధికమించి 2023 ప్రారంభంలో తిరిగి జట్టులోకి అతను రాబోతున్నట్లు ఇటీవల ఇంగ్లాండు వేల్స్ క్రికెట్ బోర్డు అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది అని చెప్పాలి.


జఫ్రా ఆర్చర్ పునరాగమనం గురించి ఎంతో ఆశ భావంతో ఉన్నామని.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే అతని విషయంలో ఎంతో జాగ్రత్తతోనే నిర్ణయాలు తీసుకుంటాము అంటూ చెప్పడం గమనార్హం. ఇక ఆర్చర్ లాంటి కీలక బౌలర్ మరోసారి టీం లోకి వస్తే అది ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద శుభవార్త లాంటిదే అవుతుందని ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాగా 2021 మార్చి నుంచి కూడా ఇంగ్లాండ్ జట్టుకు గాయాలు కారణంగా అతను దూరంగానే ఉన్నాడు. అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన ఐదవ టి20 మ్యాచ్ ఇక అతనికి అంత చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావడం గమనార్హం.


 ఈ క్రమంలోనే అతను గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే 2021 జులైలో ససెక్స్ తో జరిగిన మ్యాచ్ లో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. కానీ గాయం తిరగబెట్టడంతో చివరికి క్రికెట్కు పూర్తిగా దూరమైపోయాడు ఆర్చర్. అయితే ఇలా 2020 నుంచి కూడా వరుసగా గాయాల బారిన పడుతున్న ఆర్చర్ ఇక జట్టుకు దాదాపుగా దూరంగా ఉంటూనే వస్తున్నాడు. అతని మోచేతి గాయం ఎంతో తీవ్రం అవ్వగా ఆపరేషన్ చేసి వైద్యులు చివరికి సరి చేశారు. ఇక ఆ తర్వాత వేలికి గాయం తర్వాత బ్యాక్ ఫ్రాక్చర్ ఇలా వరుస గాయాలు అతని వేదిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే టి20 ప్రపంచ కప్ కు ఆర్చర్ దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: