ఇటీవల కాలంలో భారత క్రికెట్ లో ఎంతో మంది ప్రతిభ గల ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తెరమీదికి  వస్తూనే ఉన్నారు.  ఐపీఎల్ కారణంగా ప్రతి సీజన్లో కొత్త ప్లేయర్లు తాము భవిష్యత్తు స్టార్లు అన్న విషయాన్ని తమ ఆట తీరుతో నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పుట్టుకొస్తున్న ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించడం మాత్రం అటు సెలెక్టర్లకు కత్తి మీద సాముల మారిపోయింది  ద్వైపాక్షిక సిరీస్ లకు జట్టును సెలెక్ట్ చేయడమే ఇలా ఉంటే ఇక టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేయడం అయితే మరింత క్లిష్టంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇటీవల టీ20 వరల్డ్ కప్ కోసం కొంతమంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయగా మిగతా ఆటగాల్లని ఎంపిక ఎంపిక చేయలేదంటూ అటు బీసీసీఐపై విమర్శలు కూడా వచ్చాయి  ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఎంపిక ఎలాగో అయిపోయింది. అయితే వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఎలా ఉంటుంది అన్న విషయంపై ఇప్పటినుంచే చర్చలు జరుగుతున్నాయ్. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ బ్యాట్స్మెన్ నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ వివిఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తి మీద సాముల మారుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు.  ప్రస్తుతం యువ క్రికెటర్లు అందరూ కూడా అద్భుతంగా ఆడుతుండడంతో సెలెక్టర్లకు ఆప్షన్లు కఠిన తరంగా మారనున్నాయని చెప్పుకొచ్చాడు.


 బ్యాకప్ కోచ్గా ఇప్పటివరకు బాగానే ఉంది  ఈ విధానం ఐర్లాండ్  సిరీస్ నుంచి ప్రారంభించారు. మా వద్ద సరిపడినంతమంది మంచి క్రికెటర్లు ఉన్నారు   వారంతా భవిష్యత్తు సిరీస్ లను  దృష్టిలో పెట్టుకొని సిద్ధం అవుతున్నారు  2023 వన్డే ప్రపంచ కప్ కు సరైన జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు ఎంతో కష్టతరం అవుతుంది.  ఎందుకంటే ప్రధాన ఆటగాళ్లు అందరూ కూడా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తే అప్పుడు అవకాశాలు చాలా పరిమితంగా మారిపోతాయి   యువ ఆటగాళ్లకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. అయితే బాగా ఆడిన వారిని ఎంపిక చేస్తున్నప్పుడు మంచి ప్రదర్శనతో అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు అంటూ వివిఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vvs