2022 అక్టోబర్ 16 వ తేదీన ఆస్ట్రేలియా వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్న దేశాలు అన్నీ కూడా తమ ప్లేయర్స్ డిటైల్స్ ను ప్రకటించాయి. గత వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. ఒక ఈ జట్టుతో పాటుగా టైటిల్ కోసం ఇండియా, ఇంగ్లాండ్ జట్లు కూడా పోతే పడుతున్నాయి. ఇదిలా ఉంటే... అండర్ డాగ్స్ గా బరిలోకి దిగుతున్న వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్ మరియు శ్రీలంక జట్లను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇప్పటికీ దాదాపు అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి.

అయితే ప్రపంచ కప్ కు చెత్త ప్రదర్శన చేసి కనీసం గ్రూప్ స్టేజ్ అయినా దాటుతుందా అన్న అనుమానాలు కలిగిస్తోంది. కానీ కొన్ని జట్లకు మాత్రమే ప్రపంచ కప్ కు ముందు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కలిగింది. అందులో పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ట్రై సీరీస్ ... ఒకవైపు వెస్ట్ ఇండీస్ మరియు ఆస్ట్రేలియా ల మధ్యన ముగిసిన రెండు టీ 20 ల సీరీస్ జరిగింది. కాగా దసరా రోజున జరిగిన మొదటి టీ 20 లో వెస్ట్ ఇండీస్ పరాజయం పాలవగా, అదే ఫామ్ ను కొనసాగిస్తూ ఈ రోజు జరిగిన రెండవ టీ 20 లోనూ చెత్త ప్రదర్శ చేసి వరుసగా రెండవ ఓటమిని మూటగట్టుకుంది.

అయితే వెస్ట్ ఇండీస్ లాంటి ఆల్ రౌండర్స్ ఉన్న జట్టు వరల్డ్ కప్ కు ముందు ఓటమి పాలవ్వడం నిజంగా కరేబియన్ అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్ లలో 179 పరుగులు చేసింది. కానీ వెస్ట్ ఇండీస్ తమ పేలవమైన ప్రదర్శనతో కేవలం 147 పరుగులు చేయగలిగింది. ఈ రెండు మ్యాచ్ లలో బెస్ట్ గా ఆడిన వార్నర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ మరియు మం అఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: