ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో కూడా క్రికెట్ ఆడేందుకు అటు ఎంతో మంది ప్లేయర్లు ఇష్టపడటం లేదు అని చెప్పాలి.. తీవ్రమైన ఒత్తిడి  లో ఆడటం కంటే ఏదో ఒక ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమం లోనే తమకు నచ్చిన ఫార్మాట్లో కొనసాగుతూ ఇక ఇతర ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల కాలం లో అయితే ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఇదే దారిలో వెళ్తూ కొన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా వరల్డ్ కప్ తర్వాత ఇదే చేయబోతున్నాడు అనే చర్చ సోషల్ మీడియా లో జరుగుతుంది. తనకు ఎంతగానో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో కొనసాగి.. ఇక టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు కూడా విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ కోహ్లీ కెరియర్ లోచివరి టీ20 వరల్డ్ కప్ అవుతుందని అందరూ చర్చించు కుంటున్నారు.


 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కోహ్లీ టి20 ఫార్మాట్ కు రిటర్మెంట్ ప్రకటిస్తాడని భావిస్తున్నారు. కాగా ఇదే విషయంపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు జరుగుతున్న టి20 ప్రపంచ కప్   విరాట్కు చివరిది కాదు. అతను ఇంకా చాలా కాలం పాటు ఆడతాడు. మ్యాచ్ ను గెలిపించే పరుగులు దాహం 2024 టీ20 ప్రపంచ కప్ లో కూడా కొనసాగిస్తాడు. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి విరాట్ తనను తాను నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడు అంటూ కోహ్లీ చిన్ననాటి కోచ్ ధీమా వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: