క్రికెట్ పుట్టినిల్లుగా పిలవబడే ఇంగ్లాండ్ జట్టు ఇక ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎంత అద్భుతంగా రానించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని సెమీఫైనల్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ లో ఇండియాను ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక ఫైనల్లో కూడా పాకిస్తాన్ బౌలింగ్ దాటిని తట్టుకొని విశ్వవిజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అనే మాటే గాని ఆ జట్టులో కొంతమంది ఆటకాళ్లు మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.



 అలాంటి ఆటగాళ్లలో ఇక పవర్ హిట్టర్ గా విధ్వంసకర బ్యాట్స్మెన్ గా ఎంతగానో పేరు సంపాదించిన డేవిడ్ మల్లాన్ కూడా ఒకడు అని చెప్పాలి. ఒకటి రెండు మ్యాచ్లలో మినహా పెద్దగా అతను వరల్డ్ కప్ లో భాగంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు అని చెప్పాలి. కీలక సమయంలో అతను సింగిల్ డిజిట్ స్కోర్ కే వికెట్ కోల్పోయి జట్టుని ఎన్నోసార్లు కష్టాల్లోకి నెట్టాడు. అయితే ఇలా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొన్న డేవిడ్ మల్లాన్  ఇక ఇప్పుడు మాత్రం అద్భుతమైన సెంచరీ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. కష్టాల్లో ఉన్న జట్టును సెంచరీ తో గట్టెక్కించాడు.



 ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండు భారీ స్కోర్ చేసింది. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు డేవిడ్ మలాన్ అద్భుతమైన సెంచరీ తో భారీ స్కోర్ వైపుగా తీసుకువెళ్లాడు. దీంతో 50 ఓవర్ లలో 9 వికెట్లను నష్టానికి 287 పరుగులు చేసింది ఇంగ్లాండ్. 128 బంతుల్లో నాలుగు సిక్సర్లు 15 ఫోర్లతో డేవిడ్ మాలాన్ 134 పరుగులు చేశాడు అయితే అతను సెంచరీ తో చెలరేగినప్పటికీ అతని శ్రమంతా వృధాగా మారిపోయింది. ఎందుకంటే తర్వాత లక్ష్య చేదనకు   దిగిన ఆస్ట్రేలియా  36.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. అయినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మాత్రం డేవిడ్ మల్లాన్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: