ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది అన్న విషయం తెలిసిందే. కప్పు గెలుచుకొని భారత్ వస్తుంది అనుకున్న టీమ్ ఇండియా జట్టు ఎందుకో సెమీఫైనల్ లోనే ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఇంటి బాట పట్టింది అని చెప్పాలి. సూపర్ 12 మ్యాచ్లో బాగా రాణించిన టీమిండియా జట్టు అటు సెమీఫైనల్ లో మాత్రం చేతులెత్తేసింది. అయితే ఇక అటు ఐపిఎల్ లో దాదాపు 5 సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక టీమ్ ఇండియాకు కూడా వరల్డ్ కప్ నిరీక్షణకు తెరదించుతాడు అని.. టి20 వరల్డ్ కప్ అందిస్తాడని అందరు అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో రోహిత్ శర్మ మాత్రం అటు టీమిండియా కు వరల్డ్ కప్ అందించలేకపోయాడు అని చెప్పాలి. అదే సమయంలో ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అతని కెప్టెన్సీ నుంచి తప్పించాలని యువ ఆటగాడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా సత్తా చాటిన  పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించాలి అంటూ గత కొంతకాలం నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. కేవలం అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతూ ఉన్నారు.


 ఇకపోతే ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్బాట్ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా ప్రతిభ గల ఆటగాడని ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో ఒక ట్రోఫీ గెలిచినంత మాత్రాన అతని టీమిండియా కెప్టెన్ చేయాలని ఎవరనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 1 లేదా 2 ఇన్నింగ్స్ లో సరిగా ఆడి ఉంటే కెప్టెన్సీ మార్పు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆసియా దేశాలలో ఒకటి రెండు సిరీస్లలో విఫలమైతే చాలు ఇక కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడుతూ ఉంటారు అంటూ సల్మాన్బట్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: