గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి గాయం కారణంగా అటు జట్టుకు దూరమయ్యాడు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా . ఈ క్రమంలోనే అతను లేకుండానే టీమిండియా వరుసగా మ్యాచ్లు ఆడుతుంది అని చెప్పాలి. ఇకపోతే బుమ్రా లాగా బుల్లెట్ లాంటి బంతులు విసిరే బౌలర్ టీమిండియాలో ఎవరున్నారు అని గత కొంతకాలంగా వెతకడం ప్రారంభించారు టీమిండియా అభిమానులు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న యువ ఆటగాడు అర్షదీప్ ప్రపంచ కప్ లో మంచి బంతులు వేసి వికెట్లు పడగొట్టడంతో ఇక బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికాడని అందరూ అనుకున్నారు.



 కానీ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో మాత్రం అర్షదీప్ చేతులెత్తేసాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన టి20 సిరీస్ లో మాత్రం ఏకంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే విధంగానే హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా బ్యాట్స్మెన్ లపై తన బంతులతో నిప్పులు చెరిగి వికెట్లు రాబట్టాడు.  మూడో టి20 మ్యాచ్ లో భాగంగా నాలుగు ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్.


 ఒక రకంగా  న్యూజిలాండ్ జట్టు వెన్ను విరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న సమయంలో కీలకమైన వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. అంతకుముందు రెండవ టి20 మ్యాచ్ లోను అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక మేయిడిన్ ఓవర్ వేసి 24 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. రెండు మ్యాచ్లలో కలిపి 6.83 సగటు, 5.12 ఎకానమీతో ఆరు వికెట్లు తీశాడు.  ఇక ఈ సిరీస్ మొత్తంలో అత్యధిక వికెట్లు, బెస్ట్ యావరేజ్, బెస్ట్ ఎకనామి కూడా సిరాజ్ ఖాతాలోనే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో బుమ్రా స్థానాన్ని భారతీయ చేశావు అంటూ సిరాజ్ పై ఎంతో మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: