మొన్నటి వరకు పేలవమైన ఫాంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం అద్భుతమైన ఫాంతో అదరగొడుతూ ఉన్నాడు. ఇక టీమిండియా తరఫున వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఒత్తిడికి తలవంచి చేతులెత్తేసిన సమయంలో అటు విరాట్ కోహ్లీ మాత్రం ఆతిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో ఫామ్ లోకి వచ్చినట్లు నిరూపించుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇటీవల వరల్డ్ కప్ లో కూడా నాలుగు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అయితే 89 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే మొన్నటి వరకు టి20 బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్స్ లో 11వ స్థానంలో విరాట్ కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీల తర్వాత తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంటాడు అని అభిమానులు భావించారు. కానీ ఊహించని రీతిలో టి20 ర్యాంకింగ్స్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ మరింత దిగజారింది.


 టి20 వరల్డ్ కప్ లో భాగంగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ ర్యాంక్ పడి పోవడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు 11వ స్థానంలో కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మాత్రం రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయాడు అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం వల్ల.. ఇక ఎలాంటి పరుగులు లేకపోవడంతో కూడా అతని ర్యాంక్ మెరుగు అవ్వకుండా  పడిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: