టీమిండియా వెటరన్  స్టార్ ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా జట్టులో లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఏకంగా మొన్నటి వరకు జట్టులో స్థానం దక్కడమే అంతంత మాత్రమే ఉన్న శిఖర్ ధావన్ కు ఏకంగా భారత జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశం కూడా దక్కుతూ ఉండడం గమనార్హం. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు ఎప్పుడు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు. ఒక సిరీస్ ఆడిన వెంటనే మరో సిరీస్ కు విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నాడు.


అయితే ఇలా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం మాత్రం మిగతా క్రికెటర్లకు ఎంతగానో కలిసి వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు జట్టులో స్థానం దొరకడమే కష్టం అనుకున్న శిఖర్ ధావన్ కు జట్టులో స్థానం దక్కడమే కాదు ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేతికి వస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఆడబోయే వన్డే సిరీస్లో మరోసారి టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. ఇక రేపటి నుంచి న్యూజిలాండ్,భారత్ మ్యాచ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో జరిగిన టి20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.


 ఈ క్రమంలోనే తన కెప్టెన్సీ పై ఇటీవల శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కెప్టెన్ గా ఎక్కువ మ్యాచ్లు ఆడితేనే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలం అంటూ  ధావన్ చెప్పుకొచ్చాడు. గతంలో కంటే ఇప్పుడు కెప్టెన్ గా  జట్టు అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడంలో పరిణితి సాధించాను అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్లో ఒకలా రంజి లో మరోలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: