టీమిండియాలో  సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న దినేష్ కార్తీక్ రిటైర్ అవ్వబోతున్నాడు అనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతుంది అని చెప్పాలి. వాస్తవానికి అయితే దినేష్ కార్తీక్ ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. ఇక అతని కెరియర్ ముగిసిపోయింది అని అందరూ భావించారు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఉన్న నేపథంలో అతడు ఎంత ప్రయత్నించినా మళ్ళి టీమిండియాలోకి రావడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఐపీఎల్ లో అద్భుతంగా రానించి టీమిండియాను ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అని నిరూపించుకున్నాడు దినేష్ కార్తీక్.


 అప్పటికే అడపాదడభా అవకాశాలు మాత్రమే అందుకుని ఎన్నో ఏళ్లుగా జట్టుకు దూరమైన 37 ఏళ్ల దినేష్ కార్తీక్ మళ్ళీ టీమిండియాలోకి అరంగేట్రం చేయడమే గొప్ప విషయం అనుకుంటే.. ఇక యువ ఆటగాళ్లు అందరిని కూడా కాదని తనను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే విధంగా తన ప్రస్తానాని కొనసాగించాడు అని చెప్పాలి.. ఇలా టీమిండియా తరఫున ఒక్కసారైనా వరల్డ్ కప్ లో ఆడాలని కలగన్న దినేష్ కార్తీక్ ఆదిశగా అడుగులు వేసి చివరికి విజయం సాధించాడు. ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక సెమీఫైనల్ నుంచి వెనుతిరిగింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడూ దినేష్ కార్తీక్ రిటర్మెంట్ ప్రకటించబోతున్నాడు అనే ప్రచారం మరోసారి జోరు అందుకుంది. దీనికి కారణం ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో దినేష్ కార్తీక్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అని చెప్పాలి. టీమిండియా తరఫున  టీ20 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంటే. ఈ టోర్నీలో విజయం సాధించకపోవచ్చు. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, స్నేహితులు, అభిమానులకు నా ధన్యవాదాలు అంటూ దినేష్ కార్తీక్ బాబోద్వేగాపూరితమైన  పోస్ట్ పెట్టగా అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని ప్రచారం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: