ప్రస్తుతం టీమిండియా కు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కెప్టెన్ గా విజయవంతం అవుతున్న రోహిత్ శర్మ ఆటగాడిగా మాత్రం పూర్తిగా విఫలం అవుతూ ఉండడం గమనార్హం. గత కొంతకాలం నుంచి ఏ మ్యాచ్ లోను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయి ఉంటే మాత్రం జట్టు నుంచి తప్పించేవారు అని అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా రోహిత్ ప్రదర్శన ఉంది అని చెప్పాలి.


 ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా రోహిత్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు అనుకుంటే పేలవమైన ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిపోయాడు. ఒక రకంగా టీమిండియా వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ ఓడిపోవడానికి రోహిత్ శర్మ వైఫల్యం కూడా కారణమని చెప్పాలి. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. ఇక ఈ పర్యటన ముగిసిన వెంటనే అటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లబోతుంది.


 ఇక బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు విఫలమైన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు తన బరువును తగ్గించుకునే పనిలో పడ్డాడు అన్నది తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు జిమ్ లో వ్యాయామాలు చేస్తూ చెమటోడుస్స్తున్నాడు.  అదే సమయంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెక్షన్లో భాగంగా భారీ షాట్లు ఆడుతున్నాడు. అంతేకాదు ముంబై మైదానాల్లో రన్నింగ్ చేస్తూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. ఇక బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా రోహిత్ శర్మ మళ్ళీ మునుపటి ఫామ్ ను అందుకుంటాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: