ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా రేపు హామిల్టన్ వేదికగా రెండవ వన్ డే ను ఆడనుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య కెప్టెన్సీ లో టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని పైచేయి సాధించింది. ఇక వన్ డే సిరీస్ ను కూడా గెలుచుకోవాలన్న ప్రయత్నంలో మొదటి వన్ డే ను బౌలర్ల వైఫల్యంతో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. ఇక సిరీస్ లో నిలబడాలంటే ఖచ్చితంగా రేపు వన్ డే లో గెలవాల్సి ఉంది. శిఖర్ ధావన్ మొన్న జరిగిన వన్ డే లో బ్యాటింగ్ లో ఆకట్టుకున్నా, కెప్టెన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. మొదటి వన్ డే లో కివీస్ 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో మరో వికెట్ పడి ఉంటే ఇండియాకు గెలిచే ఆవేశాలు ఉండేవి. కానీ అలా జరగలేదు. అయితే ఎక్కడ కెప్టెన్ గా ధావన్ ఫెయిల్ అవుతున్నాడు అన్న విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం.

కెప్టెన్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను అమలు చేసి ప్రత్యర్థి టీం పై పట్టు సాధించేలా ఉండాలి. ఆ దిశగానే తన ప్రతి ఆలోచన ఉండాలి. ముఖ్యంగా ఏ ఇద్దరి బ్యాట్స్మన్ ల మధ్య భాగస్వామ్యాన్ని నమోదు చేయకుండా చూసుకోవాలి. ఆటగాడు ఆడుతున్న తీరును బట్టి కెప్టెన్ ఫీల్డర్ లను మోహరించడం మరియు బౌలర్ లను వికెట్ కోసం మార్చడం చెయ్యాలి. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది. ఇక ఏ బౌలర్ అయినా సరే ధారాళంగా పరుగులు ఇస్తున్నప్పడు వారిని పాజిటివ్ గా మోటివేట్ చేస్తూ డాట్ బాల్స్ వేయాలని ప్రేరేపించాలి. ఇక ఎప్పుడైతే ఒక ఆటగాడు ఎక్కువ డాట్ బాల్స్ ను ఆడుతాడో , ఆటోమేటిక్ గా వికెట్ వస్తుంది.

అంతే కాకుండా కెప్టెన్ రెగ్యులర్ బౌలర్లకు వికెట్లు పడని పరిస్థితుల్లో , మిగిలిన వారిని ప్రయత్నించి చూడాలి. కొన్ని సార్లు మంచి బ్యాట్స్మన్ అయినా సరే చెత్త బంతికి అవుట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఒకసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యాలి. ఇక మైదానంలో అగ్రెసివ్ గా ఉండకుండా అందరినీ కలుపుకుని పోయేలా ఉండే కెప్టెన్ కు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: