టీమిండియాలో యువ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్.. కొంతకాలం నుంచి పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ ఎంతలా పేలవమైన  ప్రదర్శన చేసినప్పటికి అతనికి జట్టి యాజమాన్యం మాత్రం వరసగా అవకాశాలు ఇస్తూ ఉంది. అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా తనని తాను నిరూపించుకోవడంలో మాత్రం రిషబ్ పంత్ పూర్తిగా విఫలం అవుతున్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో రెండు మూడు ఛాన్సులు దక్కించుకున్న రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరాడు.


 ఒక మ్యాచ్ లో కూడా తన బ్యాట్ తో ప్రభావం చూపలేకపోయాడు అని చెప్పాలి. అయినప్పటికీ అతన్ని పక్కన పెట్టకుండా అటు బీసీసీఐ మాత్రం మళ్లీ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో బలిలోకి దిగిన టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్న  రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు అని చెప్పాలి.. ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో పేలవ ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాకు భారంగా మారిపోతున్న అతన్ని పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు తెరమిదికి వచ్చాయి.


 ఇదే విషయంపై ఎంతమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇక రిషబ్ పంత్ పేలవమైన ఫాంపై న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ స్పందిస్తూ విమర్శలు గుర్తించాడు. రిషబ్ పంత్ 30 మ్యాచ్లు ఆడితే అందులో సగటు 35 మాత్రమే. సంజు  11 మ్యాచ్ లలో 60 సగటుతో బాటింగ్ చేశాడు. అందుకే రిషబ్ పంతును పీకి పారేసి సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలి. రిషబ్ పంత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఏం ఉత్తమమైన వికెట్ కీపర్ బాట్స్మన్ కాదు అంటూ సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: