భారత్లో క్రికెట్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత్ తో పోల్చి చూస్తే పాకిస్తాన్లో క్రికెట్ కి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ మిగతా ఆటలతో పోల్చి చూస్తే క్రికెట్ కి ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ క్రికెటర్లను ఒక్కసారి కలిసిన చాలు అని ఎంతోమంది అక్కడి అభిమానులు భావిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక స్టార్ క్రికెటర్లు సైతం అభిమానులను కలిసి సరదాగా ముచ్చటించటం.. ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా ఇక స్టార్ క్రికెటర్లు అభిమానులను కలిసిన సమయంలో అభిమానులు ప్రవర్తించే తీరు కొన్ని కొన్ని సార్లు నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఆనందంలో ఏం చేయాలో తెలియక.. ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాక ఉబ్బితబ్బీబై పోతూ ఉంటారు అభిమానులు. ఇకపోతే ఇటీవలే చిన్నారుల వద్దకు స్టార్ క్రికెటర్లు వచ్చి సరదాగా ముచ్చటించడంతో చిన్నారులు చేసిన కామెంట్లు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి ముందు అటు పాకిస్తాన్ జట్టు ఇస్లామాబాద్ లో ప్రాక్టీస్ లో మునిగి తేలింది.


 అక్కడికి వచ్చిన పిల్లలతో  స్టార్ ప్లేయర్లు అయినా బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫర్లు ఇచ్చేశారు. ఇలా తమ ఫేవరెట్ క్రికెటర్లను కలిసిన పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే కొంతమంది పిల్లలు బాబర్ సంతకం చేసిన బ్యాట్స్ను మోచేతులను చూపిస్తూ వీటిని వేలం వేస్తున్నామంటు సరదాగా కామెంట్లు చేశారు. ఒక బుడ్డోడు అయితే బాబర్ సంతకం చేసిన బ్యాడ్ ధర 500000 అంటే.. అంతలోనే అక్కడికి వచ్చిన మరో బుడ్డోడు తన మోచేతులపై బాబర్ సైన్ చేశాడు. ఏకంగా ధర 40 లక్షలు అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: