మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతంగా రానించి అదరగొట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇక ఇప్పుడు పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ అసమాన్యమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా పాకిస్తాన్ గడ్డపై దాదాపు దశాబ్ద కాలం తర్వాత పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఇక పాకిస్తాన్ ను సొంతగడ్డపైనే వణికిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టించారు అని చెప్పాలి.


 ఎంతో పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిగిన పాకిస్తాన్  బౌలర్లతో చెడుగుడు ఆడేశారు. అయితే ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు కాదు ఏకంగా టి20 సిరీస్ అన్న విధంగానే ప్రదర్శన చేశారు అని చెప్పాలి. ఆచితూచి ఆడటం కాదు ఏకంగా టి20 సిరీస్ ఆడుతున్నట్లుగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  టెస్ట్ సిరీస్ లో భాగంగా ఎన్నో అరుదైన రికార్డ్ కూడా కొల్లగొట్టారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు.


 అయితే ఇటీవల జరిగిన టెస్ట్ తొలి రోజు తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తమ విశ్వరూపం ఏంటో చూపించారు అని చెప్పాలి. కేవలం 27 ఓవర్లలోనే 174 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇక ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇలా 174 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసారు అని చెప్పాలి. టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ లోనే అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును కొట్టేశారు. 2018లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 158 పరుగులు చేయగా.. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తమ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో  ఈ రికార్డును బద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: