గత కొంతకాలం నుంచి వన్డే సిరీస్లలో టీమిండియా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక పోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 ఫార్మాట్లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టినప్పటికీ ఆస్ట్రేలియా వేదికగా జరిగినటి20 వరల్డ్ కప్ లో మాత్రం సెమీఫైనల్ నుంచి ఇంటి బాట పట్టింది టీం ఇండియా జట్టు. ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటినుంచే అంచనాలు వేయడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే.


 కానీ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ ఉండడం మరోవైపు వన్డే ఫార్మాట్లో భారత జట్టు పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్న నేపథ్యంలో  ఇక వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన గురించి తలుచుకుంటేనే అందరూ భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. మేము ఆడే ప్రతి సిరీస్ కూడా వన్డే ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగానే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రపంచ కప్ కు ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటికైతే అంత దూరం ఆలోచించడం లేదు అంటూ తెలిపాడు.


 ప్రస్తుతం జట్టుగా సమిష్టిగా ఎలా రాణించాలి అన్న విషయం పైన దృష్టి సారిస్తాము. ఇంకా మేము చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఏం చేయాలనుకుంటున్నామో కేవలం దాని గురించి మాత్రమే కెప్టెన్ గా తాను కోచ్గా రాహుల్ ద్రావిడ్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాము అంటూ తెలిపాడు. ఇక ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడినప్పుడు అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ తెలిపాడు. వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్లలో అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: