ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే . ఎంతో సుదీర్ఘమైన విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇక అక్కడ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే ఇక ఇరు జట్ల మధ్య జరుగుతుంది టెస్ట్ సిరీసా లేకపోతే టి20 ఫార్మాట్ లో జరుగుతున్న మ్యాచా అన్నది కూడా అటు ప్రేక్షకులకు అర్థం కాని పరిస్థితిగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అంటే ఆటగాళ్లు ఆచితూచి ఆడటం  లాంటివి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.


 ఏకంగా వందల బంతులు ఆడి పదుల సంఖ్యలో పరుగులు చేసి ఇక నిలకడగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపిస్తూ ఉంటారు ఎంతమంది ప్లేయర్లు. కానీ ఇటీవల పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం ఊహకందని రీతిలో ప్రదర్శన చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో లాగా ఆచీ తోచి ఆడటం కాదు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి ఆడారు. టి20 ఫార్మాట్ ఏమో అన్న విధంగా పరుగులు చేశారు అని చెప్పాలి. ఇక నువ్వా నేనా అన్నట్లుగానే పోటీ పడి మరి పరుగులు చేయడంతో రావల్పిండి మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రా గా ముగుస్తుందని అందరూ అనుకున్నారు. ఇలా హోరాహోరీగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన రావల్పిండి టెస్ట్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. రెండవ ఇన్నింగ్స్ లో 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 268 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఫలితం ఇంగ్లాండ్ వైఫై వెళ్ళింది. దీంతో ఘన విజయాన్ని సాధించింది ఇంగ్లాండు జట్టు. కాగా ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 657, రెండవ ఇన్నింగ్స్ లో 264 పరుగులు చేయగా.. పాకిస్తాన్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి  579, 268 చేయగా చివరికి ఇంగ్లాండ్  విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: