టీమిండియా లో యువ ఓపనర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శుభమన్ గిల్  గత కొంత కొంత కాలం నుంచి మంచి ఫామ్ లో కొనసాగుతూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. సీనియర్లు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే జట్టు  లో అవకాశం దక్కించుకుంటున్న శుభమన్ గిల్ వచ్చిన అవకాశాలను ఒడిసిపెట్టి అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇటీవల సీనియర్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యం లో న్యూజిలాండ్ పర్యటన లో ఎంపికైన శుభమన్ గిల్ వన్డే లలో ఓపెనర్ గా అదర గొట్టాడు. మంచి పరుగులు చేసి ఇక జట్టుకు శుభారంబాలు అందించాడు అని చెప్పాలి.


 కానీ బంగ్లాదేశ్ పర్యటన లో భాగంగా సీనియర్లు మళ్ళీ జట్టు లోకి రావడం తో అతనికి టీం లో చోటు లేకుండా పోయింది అని చెప్పాలి.. ఈ క్రమం లోనే శుభమన్ గిల్ ప్రతిభ పై ఇటీవలే మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కు భారత జట్టు లో తప్పకుండా శుభమన్ గిల్ కచ్చితంగా చోటు దక్కుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ భారత ఓపెనర్ల రేసులో శుభమన్ గిల్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే జట్టులో స్థానం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. రాబోయే రోజుల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా గిల్ మారతాడు అనడంలో సందేహం లేదు అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.



మరోవైపు అటు న్యూజిలాండ్ పర్యటనలో ఓపెనర్ గా మంచి ప్రదర్శన చేసిన శుభమన్ గిల్ కు వరుస అవకాశాలు ఇవ్వాలని మరికొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: