బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి వన్డేలో ఓటమిని ఎదుర్కొన్న సంగతి అందరికి కూడా తెలిసిందే. ఇంకా ఇప్పటికీ మన వాళ్ళు ఆ భాధని మరచిపోలేకపోతున్నారు.అయితే ప్రస్తుతం జరుగుతోన్న రెండో వన్డేలో జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ కూడా తగిలింది.పూర్తి వివరాల్లోకి వెళితే...ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం నాడు రెండో వన్డే స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది.ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగడం జరిగింది. అయితే రెండో వన్డేలో టీమిండియాకు చాలా పెద్ద గట్టి ఎదురుదెబ్బ అనేది తగిలింది.ఇక ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. బొటన వేళ్లకు దెబ్బతగలడంతో రోహిత్ శర్మ ఇక మైదానం వీడాడు.ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించడం జరిగింది.


ఇంకా ఈ మ్యాచ్ రెండో ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ని ప్రారంభించాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని బంగ్లా బ్యాటర్ అనాముల్ హక్ స్లిప్‌లోకి తరలించడం జరిగింది. ఇక అక్కడే ఉన్న రోహిత్ శర్మ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బొటన వేలికి బాగా గాయమైంది. ఈ క్రమంలో క్యాచ్ కూడా మిస్ అయింది.గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ మైదానాన్ని వీడాడు. రోహిత్ శర్మ స్థానంలో రజిత్‌ పటిదార్‌ సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయపడిన రోహిత్‌ శర్మను వెంటనే స్కానింగ్‌కు తరిలించినట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.ఇక ఇదిలా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలిన తరువాత సిరాజ్ వేసిన బాల్‌కు అనముల్ హుక్ (11) ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అవ్వడం జరిగింది. తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో భారత్  బౌలర్లు బాగా పెర్ఫార్మన్స్ చేశారు. ఇక మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్  ని వేయడంతో బంగ్లాదేశ్ జట్టు 28 ఓవర్లకు 108 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: