సాధారణంగా మైదానంలో ఆటగాళ్లు ఎంత అగ్రసివ్ గా ఉన్నప్పటికీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం అటు ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లు సైతం సరదాగా మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బీసీసీఐలో అయితే సహచర ఆటగాల్లనే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూఉంటారు.


 ఇక ఇలా జట్టులో ఉన్న ఆటగాళ్లు ఇక ఇతర ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇక ఈ వీడియోలను బిసిసిఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం చూస్తూనే ఉంటుంది. ఇక బిసిసిఐ ఇలాంటి వీడియో ఏదైనా షేర్ చేసిందంటే చాలు అది సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కాగా ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ జట్టులో స్పిన్నర్ గా ఉన్న యుజ్వేంద్ర చాహాల్ ను టీస్ చేయడం వైరల్ గా మారిపోయింది. రెండవ వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పై చాహల్ ఒక వీడియో తీశాడు.


 సాధారణంగానే చాహాల్ సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే యాక్టివ్గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్ లో తమకు కల్పించిన సౌకర్యాల గురించి ఒక్కొక్కటి వివరిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో మాట్లాడటం చేశాడు. ఈ క్రమంలోనే మసాజ్ సెంటర్ వద్దకు రాగానే చాహల్ ఎక్కడైనా హాయిగా ఉంటుందంటే అది ఇక్కడే అంటూ మసాజ్ సెంటర్ ను చూపించాడు. అయితే దీనిని నేను బాగా ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. చాహల్ అలా అనడాన్ని గమనించిన రోహిత్ శర్మ నీకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ టీస్ చేసాడు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: