రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు భారత జట్టులో చోటు సంపాదించుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు అంటే చాలు ఇక ఆ తర్వాత ఎన్నో మ్యాచుల వరకు కూడా వారి స్థానం జట్టులో సుస్థిరం అనే ఒక భావన అందరిలో ఉండేది. ఆటగాళ్లు కూడా ఇక ఇదే నమ్మకంతో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో పరిస్థితులు చూస్తే మాత్రం మంచి ప్రదర్శన చేసిన జట్టులో స్థానం ఉంటుందా ఊడుతుందా అన్నదానిపై గ్యారెంటీ లేకుండా పోయింది.


 ఒక మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసి ఇక ఎన్నో రికార్డులు కొల్లకట్టడమే కాదు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్న ఆటగాళ్లు సైతం ఇక ఆ తర్వాత మ్యాచ్లో బెంచ్ కి పరిమితం అవుతూ ఉండడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఇటీవల కాలంలో ప్రతి మ్యాచ్లో కూడా ఇక జట్టులో ఎవరు ఉంటారు ఎవరు బెంచ్ కే పరిమితం అవుతారు అన్న విషయంపై అందరిలో కన్ఫ్యూజన్ నెలకొంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ప్రణాళికలపై అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఒక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికైన ఆటగాడిని తదుపరి మ్యాచ్ కు పక్కన పెడుతూ ఉండడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్ ప్రణాళిక ఏంటో ఇప్పటికే అర్థం కావడం లేదు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కొన్ని నెలలైనా సరే ఒకే జటను ఎంపిక చేసి ఆడించాలి అంటూ సూచించాడు. టి20 లలో అద్భుతంగా రాణిస్తున్న సూర్య కుమార్కు వన్డే ఫార్మాట్లో ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ ప్రశ్నించాడు కపిల్ దేవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: