గత కొంతకాలం నుంచి టీమిండియా తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి.  ఈ ఒకవైపు మెగా టోర్నీలలో కాస్త నిరాశ పరుస్తున్నప్పటికీ అటు ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. విదేశీ పర్యటనకు వెళ్ళినా లేకపోతే విదేశీ జట్టు భారత పర్యటనకు వచ్చిన సిరీస్ కైవసం అయ్యేది మాత్రం కేవలం టీమిండియాకు మాత్రమే అన్న విధంగా దూసుకుపోతుంది టీమిండియా.  ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సిరీస్ లను గెలుచుకుంటూ ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పాలి.


 ఇలా ద్వైపాక్షిక సిరీస్లలో వరుసగా విజయాలు సాధిస్తున్న టీమిండియా జట్టు ఇక ఐసిసి ర్యాంకింగ్గ్స్ లలో కూడా అంతకంతకు తమ ర్యాంకును మరింత మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా ప్రదర్శన అద్భుతం అనే విధంగానే ఉంది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అదిరిపోయే ప్రదర్శన చేసింది. గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పై వన్ డే సిరీస్ లో విజయం సాధించిన టీమిండియా ఇక ఈ ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక పై 3 వన్ డేలా సిరీస్ ను క్లీన్స్వీప్ చేసింది.


 ఇక శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే ఇక భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత గడ్డపై మరోసారి అదరగొట్టింది. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.. అయితే ఇక ఇటీవలే భారత్ చేతిలో రెండు మ్యాచ్లలో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. అదే సమయంలో ఇక భారత జట్టు మూడవ స్థానానికి ఏకబాకింది అని చెప్పాలి.


 భారత్తో సిరీస్ కి ముందు న్యూజిలాండ్ 115 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. కానీ ఇటీవల వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో రెండో స్థానంలోకి పడిపోయింది. అయితే ఒకవేళ భారత జట్టు న్యూజిలాండ్ తో మూడో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసిందంటే ఇక ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతున్న జోరు చూస్తూ ఉంటే మూడో వన్డే మ్యాచ్లో కూడా న్యూజిలాండ్  చిత్తుగా ఓడించడం ఖాయం అనేది తెలుస్తుంది. కాగా మూడో వన్డే మ్యాచ్ కేవలం నామమాత్రమైన మ్యాచ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: