టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు బుమ్రా.  ఇక బుమ్రా భారత జట్టులో ఉన్నాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. అతను సంధించే  బుల్లెట్ లాంటి బంతులకు ఎక్కడ తమ బ్యాటు వెనకాల ఉన్న వికెట్లు ఎగిరిపడతాయో అనే బ్యాట్స్మెన్లు భయపడుతూ ఆచితూచి ఆడుతూ ఉంటారు అనిచెప్పాలి. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ టీమ్ ఇండియా విజయంలో ఎప్పుడు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు బుమ్రా. అంతేకాదు టీమిండియాలో  డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా కూడా బుమ్రా మంచి పేరు ఉంది.


 అలాంటి కీలక బౌలర్ గత కొంతకాలం నుంచి మాత్రం వెనునొప్పి గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరంగానే ఉంటున్నాడు. అయితే బుమ్రా లాంటి కీలక బౌలర్ లేకుండానే అటు టీమిండియా మెగా టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడడేస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల బుమ్రా మళ్లీ జట్టులోకి వస్తాడు అని సెలెక్ట్ చేసినప్పటికీ మళ్ళీ వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో కొన్నాళ్లపాటు అతనికి రెస్ట్ అవసరమని ఇక పక్కకు పెట్టేశారు సెలెక్టర్లు. అయితే ఇప్పటికే సిరాజ్ మహమ్మద్ షమీతో బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ బుమ్రా ఉంటే ఇక భారత బౌలింగ్ విభాగం పటిష్టత వేరు అని అందరి అభిప్రాయం.


 ఇక ఇటీవలే ఇదే విషయంపై సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి స్పందించాడు. నాణ్యమైన ఆటగాళ్లు గైర్హాజరు కావడం ఎప్పుడైనా బాధాకరమైన విషయమే. ఒక ఆటగాడు గాయపడినంత మాత్రాన ఆట అనేది ఎప్పుడు ఆగదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బుమ్రా లాంటి గొప్ప బౌలర్ ని మేము చాలా మిస్ అవుతున్నాం.. తప్పకుండా అతను త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తాడు అనే నమ్మకం ఉంది. అందుకోసమే ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు అంటూ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. ఇక అతన్ని భారత జట్టుతో కలిసేందుకు వేచి చూస్తున్నా అంటూ వెల్లడించాడు షమి.

మరింత సమాచారం తెలుసుకోండి: