టి20 ఫార్మాట్ అంటే ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. ఇది కేవలం మాటల్లో చెప్పడం కాదు టి20 మ్యాచ్లను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులందరూ బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ప్లేయర్లు చేసే చిన్న పొరపాట్లు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. చిన్న చిన్న పొరపాట్లే టి20 ఫార్మాట్లో విజయ అవకాశాలను దూరం చేస్తూ ఉంటాయి. ఇక ఏ బంతికి ఎలాంటి అద్భుతం జరుగుతుందో కూడా ముందే ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ipl లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఒక అద్భుతమే జరిగింది.



 ఈ మ్యాచ్ లో జరిగిన సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది అటు చెన్నై ఓపెనర్ రుతురాజుకి గైక్వాడ్ ఎంత మంచి ఫామ్ కనబరుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ చెన్నై జట్టుకి మంచి ఆరంభలు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇక అతని సూపర్ ఫామ్  చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కూడా ఎంతగానో కలిసి వస్తుంది. అయితే ఇటీవలే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో కూడా 40 బంతుల్లో 60 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు రుతురాజ్. అయితే అంతకుముందే రెండు పరుగుల వద్ద అతనికి అదృష్టం బాగా కలిసి వచ్చింది.




 రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రుతురాజు గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గుజరాత్ బౌలర్ నల్కండే వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా ఋతురాజ్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గిల్ ఎంతో సునాయాశంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు అంటూ గుజరాత్ ప్లేయర్లందరూ సంబరాలు చేసుకుంటుండగా.. ఊహించని ట్విస్ట్ నెలకొంది. అంపైర్ బంతిని నోబాల్ గా ప్రకటించాడు. దీంతో ఋతురాజ్ గైక్వాడ్ నాట్ అవుట్ గానే నిలిచాడు. ఆ తర్వాత చెలరేగి  పోయిన ఋతురాజ్... ఇక 58 పరుగులు చేశాడు. ఇలా ఒక నోబాల్ ఖరీదు ఏకంగా 60 పరుగులుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl