గత కొంతకాలం నుంచి టీమిండియాను ఓపెనర్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇద్దరే ఓపెనర్లు  ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో ఓపెనింగ్ జోడిని మారుస్తూ ఉండడం కూడా చూస్తున్నం. అయితే ఇక చాలా ఏళ్లపాటు అటు రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శిఖర్ ధావన్ కొనసాగాడు. కానీ ఆ తర్వాత కాలంలో ధావన్ ఫామ్ కోల్పోవడం అలాంటి సమయంలోనే కేఎల్ రాహుల్ సత్తా చాటడంతో ఇక ధావన్ పక్కన పెట్టేసి కేఎల్ రాహుల్ కు ఛాన్స్ ఇస్తూ వచ్చారు సెలెక్టర్లు.


 కొన్నాళ్లపాటు రోహిత్ శర్మకు రెగ్యులర్ ఓపనర్ జోడీగా కనిపించిన కేఎల్ రాహుల్ తరచూ గాయాల బారిన పడుతూ ఉండడంతో మళ్లీ టీమ్ ఇండియాకు ఓపెనింగ్ జోడి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయితే కేఎల్ రాహుల్ గాయం బారిన పడటంతో అటు యువ ఆటగాడు కిల్గిల్ తెరమీదకి వచ్చాడు. రోహిత్ కు జతగా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడే కేఎల్ రాహుల్ ను సైతం మరిపించాడు. కానీ ఇటీవల కాలంలో అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఆసియా కప్ వన్ డే వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లలో ఆడబోతుంది భారత జట్టు.


 ఈ క్రమంలోనే బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోరుకోవడం.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య తీవ్రమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వన్డే కప్ లో  ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు పృద్వి షా.  దీంతో ఇక మెగా టోర్నిలలో ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక అటు బీసీసీఐ సెలెక్టర్లు కన్ఫ్యూషన్ లో పడిపోతున్నారట.



 అయితే ఇప్పటికే ఇంతమంది ఆటగాళ్లు లిస్టులో ఉంటే ఇక యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవతత్ పడిక్కాల్ లు మేము సైతం అంటున్నారు. క్రికెట్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక టీమిండియా తరఫున ఛాన్స్ వస్తే అదరగొట్టేందుకు మేము రెడీగా ఉన్నాం అని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఇక భారత్ సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కు రోహిత్ కు జోడిగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సరైన ఓపెనింగ్ జోడితో బరిలోకి దిగకపోతే మాత్రం టీమిండియా మెగా టోర్ని లలో తేలిపోవడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: