అయితే ఈ మ్యాచ్ ఫలితం వచ్చిన తర్వాత రెండు జట్లలో ఏదో ఒక టీం కి విజయాల పరంపరకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే అటు న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు జట్టులో కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఉండడంతో అటు భారత జట్టుకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు న్యూజిలాండ్ కి మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. పటిష్టమైన భారత్తో మ్యాచ్ జరగడానికి ముందు ఒక కీలక ఆటగాడు న్యూజిలాండ్ జట్టులో చేరబోతున్నాడట. ఆ ఆటగాడి రాకతో కివీస్ జట్టు మరింత పటిష్టంగా మారుతుంది అని చెప్పాలి.
ఇలా భారత్ తో మ్యాచ్కి ముందు కివిస్ జట్టులో చేరబోయే స్టార్ ప్లేయర్ ఎవరో కాదు టీమ్ సౌథి. అతను జట్టులో చేరాడు అంటే న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిపోతుంది. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి వచ్చాడట. ఈ ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సౌథి చేతి వేలికి గాయమైంది. దీంతో వరల్డ్ కప్ కోసం సౌథి భారత్ చేరుకున్నప్పటికీ ఇక మ్యాచులు మాత్రం ఆడటంలేదు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడంతో ఇక భారత్తో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి