ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా ఇక ఆతిథ్య భారత్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగానే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం అసాధ్యం అని చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఇక భారత టీమ్స్ ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటారు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో స్వదేశీ పరిస్థితిలను బాగా వినియోగించుకుంటున్న భారత జట్టు అటు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకుపోతుంది. మరోవైపు టీమ్ ఇండియాలోని ప్రతి ఆటగాడు కూడా సూపర్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 వెరసి ఈ వరల్డ్ కప్ టోర్నిలో ఓటమి ఎరుగని జట్టుగా కూడా అటు భారత జట్టు ప్రస్థానం కొనసాగుతోంది అని చెప్పాలి  అయితే బాగా రాణించడమే కాదు గతంలోని ఓటములకు ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రతీకారం కూడా తీర్చుకుంటుంది  2019లో సెమీఫైనల్ లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ ఇక అందరికీ కన్నీళ్లు మిగిల్చింది. అయితే ఈ ఓటమికి ఇప్పుడు 2023 సెమి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. అచ్చం ఇలాగే ఇప్పుడు మరో టీం పై కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధం అవుతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.



 ఎన్నో ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకునే ఛాన్స్ టీమ్ ఇండియాకు వచ్చింది అన్నది తెలుస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్  భారత్ తో పాటు ఆస్ట్రేలియా జట్లు కూడా ఫైనల్ అడుగుపెట్టాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది  అయితే 2003 వరల్డ్ కప్ ఫైనల్ ను ఈ రెండు టీమ్స్ ఫైనల్ తలబడ్డాయి అని చెప్పాలి. అప్పుడు భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్లో తలబడ్డాయి. దీంతో న్యూజిలాండ్ పై ప్రతీకరం తీర్చుకున్నట్లుగానే అటు ఆస్ట్రేలియాపై కూడా టీమిండియా బదులు తీర్చుకుంటుంది అని భారత ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc