భారత క్రికెట్ చరిత్రలో ఎక్కడ వెతికిన కూడా ఇక ప్రస్తుతం స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీని మించిన బ్యాటర్ మరొకరు దొరుకుతారా అంటే.. ప్రేక్షకులు అందరూ కూడా ఎవరైనా దొరుకుతారా అని కాస్త ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించాడు విరాట్. దాదాపు దశాబ్దన్నర కాలంగా సెంచరీలు కొడుతూ లెక్కకు మించిన రికార్డులు సృష్టించాడు. పరుగుల వరద అంటే ఏంటో ప్రపంచ క్రికెట్కు అర్థమయ్యేలా చేశాడు. క్రికెట్ దేవుడిగా గుర్తింపును సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న చాలా రికార్డులను తుడిపేసాడు.


 అసాధ్యం అనుకున్న ప్రతి దాన్ని కూడా సుసాధ్యం చేయాలని పట్టుదలతో అతను ముందుకు సాగే విధానం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముక్తులను చేస్తుంది. అయితే ఎన్ని సాధించిన ఇంకా జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిలాగే అతనిలో కసి కనిపిస్తూ ఉంటుంది. అయితే మూడు ఫార్మాట్లలో కూడా అతను ప్రస్తుతం స్టార్ బ్యాట్స్మెన్ గా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో విరాట్ కోహ్లీ చేయలేనిది ఏదీ లేదు అని అభిమానులు అందరూ కూడా అనుకుంటారు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లాగా ఒకటి మాత్రం తాను ఎప్పటికీ చేయలేను అంటూ ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.


 సాధారణంగా కోహ్లీ పేరు చెప్పగానే బ్యాటింగ్ అందరికీ గుర్తుకు వస్తుంది. అలాగే ధోనీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కెప్టెన్సీ. అతని కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియాకు టి20, వన్డే వరల్డ్ కప్ లు అందించాడు. ఐపీఎల్ లో చెన్నైకి ఐదు కప్పులు అందించడంలో సక్సెస్ అయ్యాడు. మైదానంలో ధోని వికెట్ల వెనకాల ఉండి వేసే ఎత్తుగడలు అమలు చేసే వ్యూహాలను ఛేదించడం  మహామహుల వల్లే కాలేదు.  ఎంతటి స్టార్ బ్యాట్స్మెన్ అయినా సరే మహి వేసిన వ్యూహంలో చిక్కుకోవాల్సిందే. అందుకే ఎన్ని సాధించిన ధోనిలా మాత్రం తాను ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎప్పటికీ చేయలేను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీల కెప్టెన్సీ చేయడం అంత ఈజీ కాదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: