గత కొన్ని రోజుల నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తరచు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచే ఏదో ఒక విధంగా వార్తల్లోకి వస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభం కాకముందు అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ బాధ్యతలు చేపట్టడంతో ఇక ఎంతోమంది అతనిపై విమర్శలు చేశారు. ఇంకా కొంతమంది అతనికి మద్దతుగా కూడా నిలిచారు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక అతను కెప్టెన్ గా ఆటగాడిగా విఫలం కావడంతో ఇలాంటి ఆటగాడిన ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ చేసింది అంటూ ఇంకొన్ని విమర్శలు కూడా వచ్చాయి.


 ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ కి హార్దిక్ ను ఎంపిక చేయడంతో ఫామ్ లో ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారు అంటూ ఎంతోమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఇక గత కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తన భార్య నటాషా తో హార్దిక్ విడాకులకు సిద్ధమయ్యాడని.. ఇలా విడాకులు తీసుకున్నందుకు తన ఆస్తిలో 70% భరణంగా ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం నటాషా తన పేరు పక్కన పాండ్యా అని తొలగించడమె కాకుండా   సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను తొలగించడం.


 కానీ హార్దిక్ పాండ్యా,  నటాషా విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయం ఇక ఇటీవల అందరికీ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే భారత క్రికెట్ హార్తిక్ పాండ్యా భార్య నటాషా నుంచి విడిపోలేదు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎలా ఉంది అన్న ప్రశ్నకి.. హార్దిక్ ఆల్ గుడ్, ఆల్ స్వీట్ అని రిప్లై ఇచ్చారు. ఇటీవల నటాషా కూడా మళ్లీ హార్దిక్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నటాషా హార్తిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: