ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ టోర్నీ 2024లో భారత జట్టు ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో ఆకట్టుకుంటూ అంచనాలకు మించి రాణిస్తుంది. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటివరకు లీక్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించి అదరగొట్టిన టీమిండియా.. ఎంతో అలవోకగా సూపర్ 8 కి అర్హత సాధించింది.


 ఇక సూపర్ ఎయిట్ లో భాగంగా జరిగే అన్ని మ్యాచ్ లలో కూడా విక్టరీ సాధించి వరల్డ్ కప్ టైటిల్ పోరులో మరింత ముందుకు దూసుకుపోవాలని అనుకుంటుంది భారత జట్టు. అయితే నేడు సూపర్ 8 లో భాగంగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా  కాగా ఇలా వరుస విజయాలతో టీమిండియా దోసుకుపోతున్నప్పటికీ.. ఒక బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం అటు భారత జట్టును ఆందోళనకు గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇటీవల సూపర్ 8 స్టేజ్ కి సంబంధించిన మ్యాచ్ అంపైర్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అందులో రిచర్డ్ కెటిల్ బరో కూడా ఉన్నారు .


 అయితే ఇలా సూపర్ 8 మ్యాచ్లకు రిచర్డ్ ఎంపైర్ గా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. కాదా ఈనెల 24వ తేదీన జరగబోయే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ గా వ్యవహరించబోతున్నారు రిచర్డ్. అతను అటు టీమిండియాకు ఐరన్ లెగ్ అంపైర్ గా కొనసాగుతూ వున్నాడు అన్న విషయం తెలిసిందే. రిచర్డ్ ఎంపైర్ గా ఉన్న ప్రతి మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోతూనే వస్తుంది. ఆయన అంపైరింగ్లో 2014 t20 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టి20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్ లోను టీమిండియా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: