ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియా ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఏకంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన టీమిండియా.. ఓటమి లేని జట్టుగా దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం కీలకమైన సూపర్ 8 దశలో వరుసగా మ్యాచ్లు ఆడుతూ ఉంది అని చెప్పాలి.


 అయితే మొన్నటికి మొన్న సూపర్ 8 లో మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో 47 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. 24 గంటలు తిరగకుండానే ఇక ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. అంటీగ్వా లోని వివి రిచార్డ్స్ స్టేడియం వేదికగా రెండో సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్ తో అమీ తుమి  తేల్చుకో పోతుంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించింది అంటే టీమ్ ఇండియాకు సెమీఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉంది.


 కాగా వెస్టిండీస్ పిచ్ లు స్పిన్ కు  అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగిన.. పేసర్లదే అక్కడ హవా నడుస్తుంది  ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను భారత ఫేసర్లే జట్టును విజయతీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లోను ఇదే జరిగింది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ ట్రా ఫేసర్ తో బరిలోకి దిగనుంది అన్నది తెలుస్తుంది. కాగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్  లో తుదిజట్టులో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్ కు దూరమైన మహమ్మద్ సిరాజ్ రీ ఎంట్రీ  ఇచ్చే అవకాశం ఉందట. ఇక సూపర్ 8 లో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విఫలమైన రవీంద్ర జడేజా శివమ్ దుబేలను పక్కకు పెట్టే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది  ఇక బంగ్లా తో మ్యాచ్లో యశస్వి జైష్వాలను ఆడించే అవకాశం ఉందట  ఇలా జడేజాస్థానంలో సిరాజ్, శివమ్ దుబె స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: