ప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు లీగ్ దశ మ్యాచ్ లు ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచగా.. ఇక ఇప్పుడు.. వరల్డ్ కప్ టోర్నీ కీలకమైన సూపర్ 8 దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సూపర్ 8 లో భాగంగా ప్రస్తుతం వరుసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇప్పటికే లీగ్ దశలో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఇక సూపర్ 8 లో కూడా అదే రీతిలో విజయాల పరంపరను కొనసాగిస్తుంది. మొదటి మ్యాచ్లో భాగంగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన పోరులో 47 పరుగులు తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోను అదరగొట్టింది టీమిండియా. ఏకంగా 50 పరుగులు తేడాతో విజయ డంకా మోగించి సెమీఫైనల్ బెర్త్ ను దాదాపుగా ఖరారు చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇలా టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ 50 పరుగులు తేడాతో ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఆటగాడు మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు.


 ఏకంగా వరల్డ్ కప్ హిస్టరీలోనే 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచాడు. 40 ఇన్నింగ్స్ లలో అతను ఈ ఘనతను సాధించాడు అని చెప్పాలి. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఆఫ్రిది 39 వికెట్లు, టిమ్ సౌథి 38, హసరంగా 37,  సయ్యద్ అజ్మల్ 36 వికెట్లతో ఉన్నారు. అయితే హసరంగ కేవలం 17 మ్యాచ్ లోనే 37 వికెట్లు పడగొట్టడం గమనార్హం. అయితే అంతకుముందు ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో ఓడిన బంగ్లాదేశ్ ఇక ఇప్పుడు టీమిండియా చేతిలో కూడా ఓడిపోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: