సూర్య కుమార్ యాదవ్.. ఇండియాలో క్రికెట్ ను ఇష్టపడే ప్రేక్షకులందరికీ ఇతని పేరు తెలియకుండా ఉండదు. ఎందుకంటే తన ఆట తీరతో అందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు ఈ ఆటగాడు. కేవలం మనదేశంలోనే కాదండోయ్ ఏకంగా ప్రపంచ క్రికెట్లో కోట్లాదిమందిని సూర్యకుమార్ ఆటను అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక వరల్డ్ క్రికెట్ కి నయాన్ని మిస్టర్ 360 ప్లేయర్గా మారిపోయిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇప్పుడు ఇక మరో కీలక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 టీమ్ ఇండియాకు కెప్టెన్సీ కూడా వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మట్ కు రెగ్యులర్ కెప్టెన్ గా ఎంపికైన తర్వాత ఇక మొదటిసారి అతని కెప్టెన్సీలో శ్రీలంక పర్యటనలో t20 సిరీస్ ఆడింది టీమ్ ఇండియా. ఇక ఈ సిరీస్ ను  3-0 తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్లో ఏకంగా సూర్య కుమార్ యాదవ్ కొత్త అవతారాన్ని చూసి ప్రేక్షకులందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. సాధారణంగా సూర్య కుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే. ఎలాంటి బౌలర్ తో అయినా చెడగుడు ఆడేసి పరుగుల బోర్డును ఉరుకుల పెట్టించి అలసిపోయేలా చేయగలడు.


 అలాంటి సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అవతారం ఎత్తాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టి20 మ్యాచ్లో చివరి ఓవర్లో ఆరు పరుగులు కావలసిన సమయంలో సూర్య ఎవరి చేతికి బంతిని ఇస్తాడు అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఎవరికో ఇవ్వడం కాదు అతనే బౌలర్ గా మారిపోయాడు. అదేంటి సూర్యకుమార్ బౌలింగ్ చేస్తున్నాడు అని అందరూ అవాక్కయ్యారు. అయితే ఇక చివరి ఓవర్ బౌలింగ్ చేసిన సూర్యకుమార్ కేవలం 5పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. కానీ సూర్య కుమార్ బౌలింగ్ చూసి మాత్రం ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నీలో ఇలాంటి టాలెంట్ ఉందని ఇన్నాళ్లు అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: