ఇక మొన్నటికి మొన్న భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఇక వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే హార్దిక్ పాండ్యా తో పాటు అతని భార్య నటాషా కూడా విడాకులు తీసుకొని వేరుపడుతున్నాము అన్న విషయాన్ని ఒకేసారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా.. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అయ్యారు. అయితే గత కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్యా విడాకుల అంశంపై వార్తలు వస్తున్నప్పటికీ ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ వీరు విడాకులకు సంబంధించిన పోస్ట్ పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఇకపోతే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా భార్య నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్ళిపోయింది. ఇక అక్కడే కొడుకుతో సరదాగా గడుపుతూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అయితే గత నెల 30వ తేదీన ఆగస్త్య పుట్టినరోజు కాగా అతని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఫోటోలను.. నటాషా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలను చూసి హార్దిక్ పాండ్యా ఫాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఇక నటాషా తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ పిల్లాడిని తండ్రికి దూరం చేసావ్. కేవలం సానుభూతి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నావ్ అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.