మొన్నటికి మొన్న వెస్టిండీస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్న టీమిండియా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించింది అన్న విషయం తెలిసిందే. ఇలా సూపర్ విక్టరీ సాధించిన జోష్ లోనే ఇక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ కూడా ఆడుతుంది. కాగా ప్రస్తుతం భారత జట్టు అటు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే t20 సిరీస్ ముగించుకుంది. పొట్టి ఫార్మాట్లో జరిగిన సిరీస్లో 3-0 తేడాతో టీమ్ ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుని శ్రీలంకను వారి సొంత గడ్డమీద క్లీన్ స్వీప్ చేసింది.


 అయితే ఈ రోజు నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే వన్డే సిరీస్ కూడా ప్రారంభమైంది.  t20 సిరీస్ గెలిచిన జోష్ లో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో టి20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా అటు విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక వన్డే సిరీస్ లో సత్తా చాటాలని అనుకుంటుంది. దీంతో ఈరోజు మొదటి వన్ డే మ్యాచ్లోనే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.


 ఇకపోతే ఈ రెండు జట్ల మధ్య ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. ఇక గత రికార్డులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే మూడు దశాబ్దాలుగా శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లలో మనదే ఆదిపత్యం కొనసాగుతోంది అనేది తెలుస్తుంది. 27 ఏళ్లుగా వన్డేలలో శ్రీలంకపై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా వన్డే సిరీస్లో భారత్ ఓడిపోలేదు. లంక చివరిసారిగా 1997లో సచిన్ నాయకత్వంలోని భారత జట్టుపై సిరీస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 13 సిరీస్ లలో కూడా టీమిండియాని నెగ్గింది. మరి ఇప్పుడు ఈ రికార్డును భారత్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: